బీసీ సేన రాష్ట్ర అధ్యక్షుడు శొంఠి నాగరాజు
పెదపారుపూడి, నవంబర్ 22 (ప్రభ న్యూస్): బీసీల అంతా ఐకమత్యంగా ఉంటూ రాజ్యాధికారమే లక్ష్యంగా కృషి చేయాలని బీసీ సేన రాష్ట్ర అంల్యక్షుడు శొంఠి నాగరాజు అన్నారు. పామర్రు నియోజకవర్గ పరిధిలోని పెద పారుపూడి మండలం యలమర్రు గ్రామంలో బీసీసేన ఆత్మీయ సమావేశం నిర్వహించారు. నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర అధ్యక్షులు శొంఠి నాగరాజు పాల్గొ న్నారు. ఆయన మాట్లాడుతూ ఆర్ కృష్ణయ్య నాయకత్వంలో బీసీ సేన రాష్ట్ర వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు చేపడుతుందని, 2024 ఎన్నికల్లో బీసీలకు రాజ్యాధికారం దక్కే విధంగా అందరు కూడా ముందుకు సాగుగుదామని ఆయన అన్నారు.
బీసీలను ఓటు బ్యాంకుగా చూస్తున్నారే తప్ప రాజ్యాధికారం ఇవ్వడంలేదని ఆయన అన్నారు. త్వరలో గ్రామస్థాయి నుండి కూడా బీసీ సేన కమిటీని వేస్తున్నట్లు ఆయన ముందుగా డప్పు వాయిద్యాలు, బాణ సంచా కాలుస్తూ ద్విచక్ర వాహనాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం
నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం నిర్వహించారు. పెదపారుపూడి మండల అధ్యక్షుడిగా సొంటి చిట్టిబాబు, ఉపాధ్యక్షులుగా మెరుగుమాల కుటు అన్నాడు..ంబరావుల తో పాటు ఇతర కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సేన రాష్ట్ర ఉపాధ్యక్షులు లుక్కా వెంకట
శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్ర అధ్యక్షులు నాయకత్వంలో, బీసీ సేన రాష్ట్ర వ్యాప్తంగా అనేక సమస్యలపై పోరాటం చేయడం జరుగుతుందని ఆయన అన్నారు.
కృష్ణా జిల్లా అధ్యక్షుడు తిరుపతి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో బీసీ సేన అనేక కార్యక్రమాలు చేపడుతుం దన్నారు. అనంతరం సాంటి నాగ రాజుతో పాటు లుక్కా శ్రీనివాసరావును స్థానిక బీసీసేన నాయకులు ఆత్మీయంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో విజయవాడ సెంట్రల్ అధ్యక్షులు బెజవాడ తిరుపతిరావు, రాష్ట్ర యాదవ సంఘం నాయకులు బొడ్డు రమేష్ యాదవ్ తో పాటు పెద్దఎత్తున 45 నాయకులు, కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.
0 Comments