కేంద్ర బడ్జెట్లో ఎస్సీ,ఎస్టీ,బీసీ, మైనార్టీలకు అన్యాయం
• పార్లమెంట్లో రాహుల్ గాంధీ ప్రసంగం యావత్ భారతు ఆకట్టుకుంది
• కేంద్ర ప్రభుత్వం కుల గణన చేపట్టవలసిందే
• బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శొంఠి నాగరాజు
విజయవాడ, జూలై 31 (ప్రభన్యూస్): కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు తీవ్ర అన్యాయం జరిగిందని బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు శొంఠి నాగరాజు తెలిపారు. బుధవారం విజయవాడలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో నాగరాజు మాట్లాడుతూ. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై రాహుల్ గాంధీ ప్రసంగం యావత్ ఇండియా ను ఆకట్టుకుందని, లక్షల మంది ప్రజలు రాహుల్ గాంధీ ప్రసంగాన్ని ఆసక్తిగా విన్నారని, బడ్జెట్ ల్ రాహుల్ గాంధీ మాట్లాడుతూ బడ్జెట్ రూపొందించడంలో, హల్వా
తయారీలో 20 మంది అధికారులు పనిచేశారని వీరిలో ఒకరు మైనార్టీ, మరొకరు ఓ బి సి కి చెందిన వారు మాత్రమే ఉన్నారని, హల్వా తయారీలో సామాజిక న్యాయం ఎక్కడ పాటించారని రాహుల్ గాంధీ మాట్లాడడాన్ని ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న బీసీ, ఎస్టీ, ఎస్సీ మైనార్టీలందరూ కూడా స్వాగతించారని, ఈ సందర్భంగా బీసీ సేన తరపున రాహుల్ గాంధీకి అభినందనలు తెలియజేస్తున్నట్లు
నాగరాజు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కృతజ్ఞతలు కులగణన చేపట్టాలని, లేనిపక్షంలో ఢిల్లీ వేదికగా ఉద్యమాలు చేపట్టవలసి వస్తుందని నాగరాజు హెచ్చరించారు. స్వతంత్రం వచ్చినప్పటి కాంగ్రెస్ పా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీలకు అనుకూలంగా వ్యవహరిస్తుందని, కానీ భారతీయ జనతా పార్టీ మాత్రం బీసీ, ఎస్సీ, ఎస్టీ,, మైనార్టీలను అనగదొక్కే విధంగా వ్యవహరిస్తుందని నాగరాజు విమర్శించారు వెనకబడిన తరగతుల కమిషన్ 1957లో కాంగ్రెస్ పార్టీ తీసుకువచ్చిందని నాగరాజు గుర్తు చేశారు. కేంద్ర బడ్జెట్ బడా వ్యాపారులను, వారి ఏజెన్సీలను బలోపేతం చేయడానికి ఉన్నట్లుందని నాగరాజు అన్నారు. తక్షణమే కేంద్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ బీసీ,మైనార్టీలకు సరైన ప్రాధాన్యత లేనిపక్షంలో కేంద్రా ప్రభుత్వ వైఖరి నిరసనగా ఉద్యమాలు చేపట్టవలసి వస్తుందని నాగరాజు తెలిపారు. వెనుకబడిన తరగతుల వారి గురించి పార్లమెంట్లో మాట్లాడిన రాహుల్ గాంధీ ప్రసంగం చాలా అద్భుతంగా ఉంద న్ నాగరాజు అన్నారు.
0 Comments