lide

Ticker

6/recent/ticker-posts

షర్మిలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పంచ్ ప్రభాకర న్ను అరెస్టు చేయాలి.


రాష్ట్ర డీజీపీ స్పందించి సుమోటోగా కేసు నమోదు చేయాలి
• బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు, పెడన కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి శొంఠి నాగరాజు

విజయవాడ, ఆగస్టు 9: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన పంచ్ ప్రభాకర్ ను తక్షణమే ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్టు చేయాలని బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పెడన కాంగ్రెస్ పార్టీ శొంఠి నాగరాజు డిమాండ్ చేశారు. శుక్రవారం విజయవాడలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో నాగరాజు మాట్లాడుతూ పంచ్ ప్రభాకర్ విదేశాల్లో ఉంటూ ఇష్టానుసారం మాట్లాడుతున్నాడని, షర్మిలపై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, తక్షణమే ఆంధ్రప్రదేశ్ డిజిపి స్పందించి సుమోటోమోగా పంచ్ ప్రభాకరపై కేసు నమోదు చేసి ఆంధ్రప్రదేశకు తీసుకురావాలని నాగరాజు అన్నారు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన డాక్టర్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె అయినటువంటి షర్మిలారెడ్డిపై పంచ్ ప్రభాకర్ ఇష్టానుసారం మాట్లాడుతున్నాడని, జగన్మోహన్ రెడ్డిని పొగుడుతూ షర్మిలాను తిడుతూ వాగుతున్న పంచ్ ప్రభాకర్ను తక్షణ పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపించాలని నాగరాజు కోరారు. ఎక్కడో విదేశాల్లో ఉంటూ వ్యక్తిగత విమర్శలు చేస్తూ సోషల్ మీడియాలో తన ఇష్టానుసారం మాట్లాడుతూ వ్యవహరిస్తున్న ప్రభాకర్ కు రాష్ట్ర పోలీసులు సరైన గుణపాఠం చెప్పాలనినాగరాజుకోరారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం స్పందించి తక్షణమే అతనిపై కేసు నమోదు చేసే విధంగా ఆంధ్రప్రదేశ్ డిజిపిని ఆదేశించాలని నాగరాజు విజప్తి చేశారు.

Post a Comment

0 Comments