lide

Ticker

6/recent/ticker-posts

ఘనంగా శొంఠి నాగరాజు జన్మదినోత్సవం


• రాష్ట్రం నలు మూలల నుంచి తరలివచ్చిన బీసీ నాయకులు

• బీసీలకోసం అనునిత్యం పోరాడుతున్న నాగరాజు

నాగరాజు దంపతులను సత్కరిస్తున్న అభిమానులు

విజయవాడ, డిసెంబర్ 3 (ప్రభన్యూస్) : బీసీ సేన రాష్ట్ర అధ్యక్షుడు శొంఠి నాగరాజు జన్మదిన వేడుకలను విజయవాడలో కృష్ణా జిల్లా బీసీ సేన ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక కానూరులో శొంఠి నాగరాజు జన్మదిన వేడుకలను రాష్ట్రం నలుమూలల నుండి వచ్చిన బిసిసేన నాయకులు, ఎస్సీ సంఘ నేతలు, కార్యకర్తలు, అభిమానుల మధ్య మధ్య ఘనంగా నిర్వహించారు. ముందుగా భారీ బాణాసంచా కాలుస్తూ ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన భారీ కేకును కట్ చేశారు. కృష్ణా జిల్లా అధ్యక్షుడు తిరుపతి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో భారీ గజమాలతో శొంఠి నాగరాజు దంపతులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో పలువురు మాట్లాడుతూ బీసీల కోసం నాగరాజు చేస్తున్న సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో కృష్ణా జిల్లా బీసీ సేన అధ్యక్షులు తిరుపతి శ్రీనివాసరావు, ఏఐసీసీ వ్యవస్థాపకులు గేరా హానోక్, ఆంధ్రప్రదేశ్ ట్రైబల్ సంఘ అధ్యక్షులు మనుపాటి నవీన్, కోస్తా ఆంధ్ర ఇంచార్జి చింతా శ్రీనివాసరావు, తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు స్వర్ణ S సమార్, లీగల్ అడ్వైజర్ కార్తీక్, రాష్ట్ర యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ శరత్ కుమార్, విజయవాడ సిటీ అధ్యక్షులు తిరుపతిరావు, జున్ను నాగరాజు, కుక్కల రాంప్రసాద్, ప్రముఖ వాక్యోపదేశకులు కరుణ్ కుమార్, మహిళా నాయకురాలు జ్యోతి, కోడూరు మండల బీసీ సేన అధ్యక్షుడు కొండవీటి సురేష్, వేజెండ్ల శ్రీనివాసరావు, రామను రాం మోహన్ రామ్, యార్లగడ్డ ఓంకార్, గోలి సాంబశివరావు, కలిదిండి మండలం అధ్యక్షులు మహేష్, తో పాటు పెద్ద ఎత్తున బీసీ సేన నాయకులు, కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments